Fake notes from `Reverse Bank of India` seized in Gujarat`s Surat గుజరాత్ లో రూ.25 కోట్ల నకిలీ నోట్లు.. అంబులెన్స్ సీజ్..

Fake currency notes of over rs 25 crore seized from ambulance in gujarat s surat

fake notes, Counterfiet Notes, Reverse Bank of India, Kamrej police station, ambulance, Ahmedabad-Mumbai Road, secret information,Surat, Gujarat, Crime

Police recovered fake notes worth more than 25 crores from an ambulance in Surat, Gujarat. This incident is from Kamrej police station area of the district. SP Hitesh said that the police stopped an ambulance on Ahmedabad-Mumbai Road on the basis of secret information.

గుజరాత్ సూరత్ లో రూ.25 కోట్ల నకిలీ నోట్లు.. అంబులెన్స్ సీజ్..

Posted: 09/30/2022 06:12 PM IST
Fake currency notes of over rs 25 crore seized from ambulance in gujarat s surat

త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న గుజరాత్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.25 కోట్ల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో అంబులెన్స్‌లో త‌ర‌లిస్తున్న ఈ నకిలీ నోట్ల తరలింపుపై పక్కా సమాచారం అందిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై-అహ్మదాబాద్ రోడ్డు రూ 25 కోట్ల ఫేస్‌వ్యాల్యూతో కూడిన న‌కిలీ నోట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అంబులెన్స్‌ వాహనంలో నకిలీనోట్లను తరలిస్తున్నారన్న పక్కా సమాచారం అందుకోవడంతో దానిని అడ్డ‌గించిన పోలీసులు వాహ‌నం నుంచి న‌కిలీ ఇండియ‌న్ క‌రెన్సీని సీజ్ చేశారు.

ఆరు బాక్సుల్లో 1290 బండిల్స్‌లో నోట్ల‌ను త‌ర‌లించ‌డాన్ని పోలీసులు క‌నుగొన్నారు. సూర‌త్‌లోని క‌మ్రేజ్ ప్రాంతంలో అంబులెన్స్‌ను పోలీసులు నిలిపివేశారు. రూ 2000 నోట్ల‌తో న‌కిలీ క‌రెన్సీని త‌ర‌లిస్తుండ‌గా వీటిపై రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బ‌దులు రివ‌ర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉన్నాయి. ఇక దాని కింత కేవలం సినిమా షూటింగ్ కోసం మాత్రమే వినియోగించుకునేందుకు మాత్రమే అని కూడా రాసిఉంది. అయితే నిజంగా అలా అయితే పోలీసుల సమ్మతి తీసుకుని ఏకంగా ఏదైనా ట్రక్కులో తరలించే బదులు.. అంబులెన్స్ లో తరలించాల్సిన అవసమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పోలీసుల కళ్లు గప్పి.. అంబులెన్సులో నకిలీ నోట్ల చలామణి చేయాల్సిన అవసరం ఏంటన్న కోణంతో పాటు ఎవరు వీటిని ముద్రించారన్న కోణంలోనూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంబులెన్స్‌పై ఒక భాగంలో దిక్రి ఎడ్యుకేష‌న్ ట్ర‌స్ట్‌-సూర‌త్ అని రాసి ఉండ‌గా మ‌రో వైపు గో మాత రాష్ట్ర మాత అని రాసి ఉంది. ఈ నోట్ల‌ను ఎక్క‌డ ముద్రించి ఏ ప్రాంతానికి త‌ర‌లిస్తున్నార‌నేది అంబులెన్స్ డ్రైవ‌ర్‌ను ప్ర‌శ్నిస్తున్నామ‌ని, విచార‌ణ అనంత‌రం మ‌రిన్ని వివ‌రాలు వెలుగుచూస్తాయ‌ని ఎస్పీ హితేష్ జోస‌ర్ తెలిపారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకుంద‌ని అధికారులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles